"బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః" అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.

బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జమ్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు, బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప. సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.

 సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు వీరు బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు మరియు మునుల వలన జన్మించిన వారు బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. వీరు మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు.

సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి ఉపదేశించినది   విశ్వామిత్ర మహర్షి 

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి వేద మరియు పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.

I BUILT MY SITE FOR FREE USING